---Advertisement---

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం!

September 28, 2026

Summarize with AI

---Advertisement---

బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) సోదాలు (Raids) కలకలం రేపుతున్నాయి. పన్ను ఎగవేత(Tax Evasion), ఆర్థిక లావాదేవీల్లో(Financial Transactions) అవకతవకలకు సంబంధించిన అనుమానాల నేపథ్యంలో ముంబై ఐటీ అధికారులు (Mumbai IT Officials) పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ఈ సోదాల్లో నటి రకుల్ ప్రీత్ సింగ్‌తో(Rakul Preet Singh) పాటు బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీ(Vashu Bhagnani), ప్రముఖ నిర్మాణ సంస్థ పానోరమా స్టూడియోస్ (Panorama Studios) పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన దాదాపు 12 ప్రాంతాల్లో ఐటీ శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సినిమా నిర్మాణం, షూటింగ్‌లు, విదేశీ పంపిణీ (Overseas Distribution), నిర్మాణ వ్యయాలకు సంబంధించిన లావాదేవీల్లో భారీ మొత్తంలో నిధుల బదిలీ జరిగినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీల్లో పన్ను నిబంధనలు ఉల్లంఘించారా అనే కోణంలో అధికారులు వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించిన వాసు భగ్నానీ, పానోరమా స్టూడియోస్‌కు సంబంధించిన వ్యక్తులు, సంస్థలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు లేదా ఇతర ఆధారాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఐటీ శాఖ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment