ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఓటర్ల జాబితా (Voters List) ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు (SIR Process) ఎన్నికల సంఘం (Election Commission) గడువు పొడిగించింది. 01.07.2026ను అర్హత తేదీగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో(Assembly Constituencies) సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5లోగా అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి, అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉంది. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నో-మ్యాపింగ్(No-Mapping), లాజికల్ డిస్క్రెపెన్సీ(Logical Discrepancy) కేసుల విచారణలు ఇంకా కొనసాగుతుండటంతో పాటు, ఫారం-6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిష్కారం కూడా పెండింగ్‌లో ఉంది.
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా అనుకోకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ గడువులను పొడిగించిందని పెర్కోన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16, 2026కు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ సవరించిన షెడ్యూల్ వర్తించనుంది.






