---Advertisement---

తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. సీసీటీవీలో కీలక దృశ్యాలు!

October 1, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌లో(Hyderabad) చెడ్డీ గ్యాంగ్ (Chaddi Gang ఘటన మరవకముందే తిరుపతిలోనూ(Tirupati) అనుమానాస్పద వ్యక్తుల సంచారం కలకలం రేపుతోంది. తిరుచానూరు (Tiruchanur) సమీపంలోని కొత్తపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు మాస్కులు, చెడ్డీలు ధరించి సంచరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో(CCTV Cameras) నమోదయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల హైదరాబాద్‌లోని మణికొండలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించింది. ఈ సమయంలో అక్కడి ఓ మహిళ(Women) వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

తాజాగా తిరుచానూరు కొత్తపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి, చెడ్డీలు వేసుకుని సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. వారు ఓ కుక్కను తరుముతున్న దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డయ్యాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరు, అక్కడ ఎందుకు సంచరించారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ఘటన తర్వాత తిరుపతిలోనూ ఇలాంటి దృశ్యాలు వెలుగులోకి రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment