---Advertisement---

సుప్రీంకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ..!

October 1, 2026

Summarize with AI

---Advertisement---

లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు (Ilaiyaraaja) సంబంధించిన కాపీరైట్ వివాదంలో(Copyright Dispute) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’(En Iniya Pon Nilave) పాటకు సంబంధించి దిల్లీ హైకోర్టు (Delhi High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇళయరాజా పిటిషన్‌ను జస్టిస్ జె.బి. పర్దివాలా(J.B. Pardiwala), జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో(K. Vinod Chandran) కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సినిమాల్లోని పాటలకు సంబంధించిన కాపీరైట్ హక్కులపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఒక సినిమాలోని పాటకు సంబంధించిన అన్ని హక్కులు కేవలం సంగీత దర్శకుడికే చెందవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంగీత దర్శకుడికి తాను స్వరపరిచిన సంగీతంపై (Music Composed) కాపీరైట్ హక్కులు ఉంటాయని పేర్కొంది. అదే సమయంలో పాటలోని సాహిత్యంపై (Lyrics) గేయ రచయితకు(Lyricist), సౌండ్ రికార్డింగ్‌పై(Sound Recording) సంబంధిత నిర్మాత లేదా రికార్డింగ్ లేబుల్‌కు హక్కులు ఉంటాయని వివరించింది.

ఈ నేపథ్యంలో పాటలోని సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై ఇళయరాజాకు కాపీరైట్ హక్కులు ఉండవని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

దీంతో ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో మ్యూజిక్ లేబుల్ సరిగమకు ఊరట లభించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment