---Advertisement---

కళ్యాణలక్ష్మి పథకంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!

October 2, 2026

Summarize with AI

---Advertisement---

కళ్యాణలక్ష్మి పథకం (Kalyana Lakshmi Scheme) 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన పథకం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కళ్యాణలక్ష్మిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమ (Telangana Movement) సమయంలో ఓ గిరిజన తండాలో(Tribal Thanda) తాను చూసిన ఘటన కేసీఆర్‌ను(KCR) ప్రభావితం చేసిందని కేటీఆర్ తెలిపారు. పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.

కళ్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) పథకాలు 2014 అక్టోబర్ 2న ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన పేద కుటుంబాల్లోని వధువులకు వివాహ సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.

గత 12 ఏళ్లలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని కేటీఆర్ తెలిపారు. ఈ పథకం బాల్య వివాహాలను తగ్గించడంలోనూ ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.

కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభ సమయంలో రూ.51,000 ఆర్థిక సహాయం అందించగా, 2018లో ఈ మొత్తాన్ని రూ.1,00,116కు పెంచారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చే (Diluting) ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తులం బంగారం సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం అమల్లో ఉన్న కళ్యాణలక్ష్మి పథకాన్నే కొనసాగించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

కళ్యాణలక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్ధిదారులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి ఈ పథకం అందించిన ఆర్థిక సహాయాన్ని ఆయన గుర్తుచేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment