విజయవాడలో(Vijayawada) వామపక్షాలు, ప్రజాసంఘాల (People’s Organizations) ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా(Voters List) ప్రత్యేక సవరణ ప్రక్రియను (Special Revision Process) తక్షణమే నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
సర్ ప్రక్రియలో(SIR Process) అన్యాయంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే చర్యలకు ఎన్నికల సంఘం తావివ్వకూడదని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు నినదించారు.
దేశవ్యాప్తంగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడలోనూ ఈ ఆందోళనకు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.





