మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కల్ట్’(Cult) సినిమాతో సరికొత్త స్లాషర్ జానర్‌ను (Slasher Genre) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. భారతీయ సినిమాలో అరుదుగా కనిపించే ఈ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కల్ట్’ షూటింగ్ (Cult Shooting) పూర్తయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో(Ramoji Film City) భారీ సెట్స్(Grand Sets) వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సుమారు 40 నుంచి 50 రోజుల పాటు వందలాది మోడల్స్‌తో యాక్షన్, స్లాషర్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు (Teaser) మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న (October 30) సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందిస్తుండగా, ‘యానిమల్’ సౌండ్ డిజైనర్ సచిన్(Sachin) కూడా పనిచేశారు. తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) సంభాషణలు అందించారు. తారక్ సినిమా బ్యానర్‌పై సందీప్ కాకరాల (Sandeep Kakarala) నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ (Gayatri Bharadwaj) హీరోయిన్గా నటిస్తోంది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్స్, స్లాషర్ అంశాలతో తెరకెక్కుతున్న ‘కల్ట్’ అక్టోబర్ 30న ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.








