రాయలసీమలో(Rayalaseema) ఉద్యాన పంటల (Horticulture Crops అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు (Investments) తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన ప్రకటనపై వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ఇంత భారీ పెట్టుబడుల ప్రకటనకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ వ్యయం ఎక్కడ జరిగాయో ప్రభుత్వం (Government) స్పష్టం చేయాలని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రచార ప్రకటనలు చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులు(Farmers) ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
ఉద్యాన, వ్యవసాయ రైతులకు(Farmers) గత రెండున్నరేళ్లుగా సరైన మద్దతు అందడం లేదని జగన్ ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు (Remunerative Prices) లేక రైతులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి, పంటల బీమా, ఇతర రైతు సంక్షేమ పథకాల అమలుపై ఆయన ప్రశ్నలు సంధించారు. పథకాల్లో మార్పుల కారణంగా రైతులపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు.
సున్నా వడ్డీ రుణాల పథకాన్ని(Zero Interest Loan Scheme) ప్రభుత్వం బలహీనపరిచిందని, ఇన్‌పుట్ సబ్సిడీలు(Input Subsidies) సకాలంలో అందడం లేదని జగన్ ఆరోపించారు. భారీ పెట్టుబడుల ప్రకటనల కంటే రైతులకు నేరుగా ఆర్థిక, వ్యవసాయ సహాయం అందించడమే ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు.
ఇదే సమయంలో రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులపై (Drought Conditions) కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో విస్తరించిన ఉద్యాన పంటలకు నీటి కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తనను తాను ‘వాటర్ మ్యాన్’గా చెప్పుకునే చంద్రబాబు పాలనలోనే కరువు ప్రాంతాల్లో రైతులు పంటలకు నీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Rayalaseema Lift Irrigation Project) పరిస్థితిపైనా జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
కరువు ప్రభావంతో రాయలసీమలో (Rayalaseema) పెద్ద సంఖ్యలో బోర్లు ఎండిపోయాయని జగన్ పేర్కొన్నారు. ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఒక్కో వాటర్ ట్యాంకర్‌కు సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికే పంట నష్టాలు, మార్కెట్ ధరల అనిశ్చితితో ఇబ్బందులు పడుతున్న రైతులపై నీటి కోసం అదనపు ఖర్చు మరింత ఆర్థిక భారంగా మారిందని అన్నారు.
రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ (Horticulture Hub) ఏర్పాటు చేస్తామనే ప్రకటనల కంటే ముందుగా కరువు ప్రభావిత రైతులకు తక్షణ సహాయం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. నీటి కొరతను ఎదుర్కొంటున్న రైతులకు అవసరమైన చర్యలు చేపట్టి, ఉద్యాన పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.





