సినీ తారల పుట్టినరోజు వేడుకలు అంటే కేక్ కటింగ్‌లు(Cake Cuttings), పార్టీలతో సందడిగా సాగుతుంటాయి. కానీ మంచు మనోజ్ (Manchu Manoj) తన భార్య మౌనిక భూమా మంచు (Mounika Bhuma Manchu) పుట్టినరోజును మాత్రం కాస్త భిన్నంగా జరిపారు. మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మనోజ్ చేసిన భావోద్వేగ పోస్ట్ (Emotional Post) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మౌనిక తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టసమయాల్లో తనకు అండగా నిలిచారని మనోజ్ తెలిపారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆమె అందించిన నమ్మకం, ధైర్యం తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలను (Family Responsibilities) నిర్వర్తించడంతో పాటు, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మౌనిక ధైర్యాన్ని(Courage) మనోజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
మౌనిక పుట్టినరోజును కేవలం వ్యక్తిగత వేడుకగా కాకుండా సామాజిక సేవకు అంకితం చేయడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. ‘నమస్తే వరల్డ్’(Namaste World), ‘ఐక్య ధైర్య సేన సమితి’(Aikya Dhairya Sena Samithi) ద్వారా మౌనిక చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మనోజ్ అభినందించారు.
మౌనిక పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఐక్య’(Aikya) సంస్థను ప్రారంభించినట్లు మనోజ్ వెల్లడించారు. ఈ ఆలోచనకు ప్రధాన స్ఫూర్తి మౌనికేనని తెలిపారు. సమాజం కోసం ఆమె కంటున్న ప్రతి కలను సాకారం చేసేందుకు తమ కుటుంబం ఎప్పటికీ ఆమెకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తమ కుటుంబం, కలిసి నిర్మించుకున్న జీవితానికి కృతజ్ఞతలు తెలిపిన మనోజ్.. మౌనిక తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్నారు. భార్యపై తనకున్న ప్రేమతో పాటు, సమాజ సేవ పట్ల ఆమెకున్న నిబద్ధతను ప్రస్తావిస్తూ చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Happy birthday to my life line Mounika. You believed in me on the days I could not. Through my toughest time and every step of my comeback, your faith gave me strength. To Dhairav and DevaSena, you are home. Keep building your dreams. I love you. #HBDMounikaBhumaManchu https://t.co/2zwBrLijbQ
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2026








