2024 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఈవీఎంల నిర్వహణ(EVMs Management), ఓట్ల లెక్కింపుపై (Vote Counting) అనుమానాలు ఉన్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు (CPM Central Committee) తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) పేర్కొన్నారు. సామాజికవేత్త పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) చేసిన సర్వే, విశ్లేషణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. 1,400 పోలింగ్ బూత్‌లలో(Polling Booths) నమోదైన ఓట్ల వివరాలను పరిశీలించగా, కొన్ని కేంద్రాల్లో పోలైన ఓట్ల కంటే అదనంగా ఓట్లు నమోదైనట్లు విశ్లేషణలో గుర్తించారని చెప్పారు. 1,500 ఓట్ల సామర్థ్యం ఉన్న బూత్‌లలో 2,000 వరకు ఓట్లు లెక్కింపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ గణాంకాల ఆధారంగా ఎన్నికల ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, డేటా సైంటిస్టులు, నిపుణులు ఈ అంశాలను పరిశీలించి ఎన్నికల సంఘానికి వివరాలు అందించారని తమ్మినేని తెలిపారు. దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ(Lok Sabha Elections) సుమారు 79 స్థానాల్లో ఫలితాలు ప్రభావితమయ్యాయనే విశ్లేషణ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తలెత్తుతున్న అనుమానాలపై సమగ్రంగా చర్చించి, వాస్తవాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.





