---Advertisement---

ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ నియామకం!

October 6, 2026

Summarize with AI

---Advertisement---

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు (IPL 2027 Season) ముందు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals – DC) కీలక మార్పులు చేసింది. జట్టు కోచింగ్ విభాగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని (Sourav Ganguly) ప్రధాన కోచ్‌గా(Head Coach) నియమించింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేసిన గంగూలీ.. ఇప్పుడు హెడ్ కోచ్‌గా జట్టు బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమానులైన జీఎంఆర్ గ్రూప్(GMR Group), జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్(JSW Sports) మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి నిర్వహణ బాధ్యతలు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జట్టు కోచింగ్ విభాగంలో మార్పులు జరిగాయి. 2025, 2026 సీజన్లలో పనిచేసిన కోచింగ్ సిబ్బంది స్థానంలో కొత్త బృందానికి బాధ్యతలు అప్పగించారు.

గంగూలీ నేతృత్వంలోని కొత్త కోచింగ్ యూనిట్‌లో పలువురు దిగ్గజ మాజీ క్రికెటర్లు చేరారు. భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) బ్యాటింగ్ కోచ్‌గా, శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ (Chaminda Vaas) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా(Amit Mishra) స్పిన్ బౌలింగ్ కోచ్‌గా జట్టుతో కలిసి పనిచేయనున్నారు.

అనుభవజ్ఞులైన మాజీ ఆటగాళ్లతో బలమైన కోచింగ్ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటివరకు అందని ఐపీఎల్ టైటిల్‌ను సాధించడమే లక్ష్యంగా 2027 సీజన్‌లో బరిలోకి దిగనుంది. గంగూలీ మార్గదర్శకత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ జట్టు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment