విశాఖ జిల్లాలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా పాత గాజువాకలోని టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు (ASHA Workers) నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, నాణ్యమైన సెల్ఫోన్లు, రూ.10 లక్షల ఆరోగ్య బీమా(Health Insurance), యూనిఫాం (Uniform) అందించాలని కోరారు. రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆశా వర్కర్లు(ASHA Workers), ఏఎన్ఎంల (ANMs) నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని, స్కీమ్ వర్కర్లందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.






