---Advertisement---

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. నేవీ ఉద్యోగితో పాటు ఏపీలో మరో వ్యక్తి అరెస్ట్

October 6, 2026

Summarize with AI

---Advertisement---

పాకిస్థాన్‌ (Pakistan కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇద్దరిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు (Andhra Pradesh Police) అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో విశాఖపట్నం (Visakhapatnam) నేవల్‌ బేస్‌లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగితో పాటు నేవీ అధికారులకు కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది అనుమానితులు ఉండగా.. వారిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం.. విశాఖపట్నం నేవల్‌ బేస్‌లో(Naval Base) పనిచేస్తున్న నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీ(Pradeep Mukherjee), నేవీ అధికారులకు కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌ను (Annam Sai Varaprasad) అరెస్ట్ చేశారు.

భారతదేశంలో కొందరు వ్యక్తులు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌తో(Pakistan Intelligence Operatives) నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ.. దేశ భద్రతకు ముప్పు కలిగించే గూఢచర్య కుట్రలో(Espionage Conspiracy) పాల్గొంటున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు, మిగిలిన అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోందని ఏపీ పోలీసుల కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ (Counter Intelligence Cell) వెల్లడించింది.

ప్రదీప్‌ ముఖర్జీని ఇటీవల తమిళనాడులోని(Tamil Nadu) కోయంబత్తూరులో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడలోని కోర్టులో హాజరుపరచగా.. అక్టోబర్‌ 14 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. సాయి వరప్రసాద్‌కు కూడా అక్టోబర్‌ 14 వరకు కోర్టు రిమాండ్ విధించగా.. ఆయనను కూడా అదే జైలులో ఉంచారు.

ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌-2026లో(Operation Firewall-2026) భాగంగా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ 10 రాష్ట్రాల పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుని అనుమానితుల కదలికలపై దర్యాప్తు చేపట్టింది.

పోలీసుల ప్రకారం.. ప్రదీప్‌ ముఖర్జీ, సాయి వరప్రసాద్‌ పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌కు కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని విశాఖపట్నంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రక్షణ సంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ ఛానళ్ల (Encrypted Communication Channels) ద్వారా పాక్‌ ఆపరేటివ్స్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన అనుమానితుల పాత్రపై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment