---Advertisement---

ఒక్కరితో ఆగని ‘అరవ’ వ్యవహారం… వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

February 7, 2026

Summarize with AI

---Advertisement---

ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో జనసేన పార్టీకి చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తీవ్ర విమర్శల ఏదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో, బాధిత మహిళ వీణ తాజాగా ఎమ్మెల్యేకు సంబంధించిన మరికొన్ని వ్యక్తిగత వీడియోలు మరియు చాట్‌లను బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వీటిలో ఆయన పలువురు మహిళలతో అనుచితంగా వ్యవహరించినట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.

బెంగళూరులో చదువుకుంటున్న యువతికి వరుసగా పంపిన సందేశాలు, మరో మహిళ శరీరాన్ని అసభ్యంగా వర్ణించిన చాట్‌లు, వివాహితను కూడా వేధించిన ఘటనలు బయటపడటంతో ఈ వ్యవహారం మరింత దూమారం రేగింది. ఇవి కేవలం కొంతమాత్రమేనని, ఇంకా అనేక ఆధారాలు తన వద్ద ఉన్నాయని బాధిత మహిళ వెల్లడించడంతో, ఈ కేసు రాజకీయంగా కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తన పార్టీ ఎమ్మెల్యే పైన సాక్ష్యాలతో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా పవన్ కళ్యాణ్ నివేదికలు అంటూ కాలయాపన చయడమేంటని జనసేన అభిమానుల్లో చర్చ నడుస్తుంది. ఆడపిల్లకి అన్యాయం జరిగితే తల తీసే చట్టాలు తెస్తాం అన్న పవన్ కళ్యాన్ కనీసం తన పార్టీ ఎమ్మెల్యేనే సస్పెండ్ చేయలేని బలహీనుడా అని ప్రజల్లో చర్చ మోదలవడం కోసమెరుపు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment