---Advertisement---

తిరుమలలో కనిపించని టీటీడీ చైర్మన్? వైసీపీ వినూత్న నిరసన!

March 11, 2026

---Advertisement---

తిరుమలలో (Tirumala) మరోసారి వివాదాలు రాజుకుంటున్నాయి. టీటీడీ (TTD) పరిపాలన భవనం (Administrative Building) ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) వినూత్న నిరసన కార్యక్రమాన్ని (Innovative Protest Program) చేపట్టింది. ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) కనిపించడం లేదంటూ, ఆయనను వెతుకుతున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో తిరుమల కేంద్రంగా వరుస వివాదాలు (Continuous Controversies) చర్చనీయాంశంగా మారుతున్నాయి. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయ్యిందన్న ఆరోపణలతో మొదలైన ఈ వివాదం, తరువాత పలు సంస్థలతో ఉన్న సంబంధాలు, అధిక ధరలకు నెయ్యి టెండర్లు కేటాయించారనే విమర్శలతో మరింత ముదిరింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు (Dhulipalla Narendra) చెందిన సంగం సంస్థపై కూడా కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ఇదే సమయంలో వైష్ణవీ డైరీతో (Vaishnavi Dairy) ఉన్న సంబంధాలపై వచ్చిన ఆరోపణలు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యక్తిగతంగా వివాదాల్లో చిక్కుకున్నారనే వార్తలు రాజకీయంగా మరింత చర్చకు దారితీశాయి. ఆయనపై మహిళలతో సంబంధించిన వ్యక్తిగత వీడియోలు బయటకు వచ్చి ఆయన నైతికతపై ఆరోపణలు వినిపించగా, భగవద్గీతను అవమానించారనే విమర్శలు కూడా వచ్చాయి. అదేవిధంగా పరకామణి విభాగంలో (Parakamani Department) స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలలో కోటి రూపాయల విలువైన బంగారం చోరీ (Gold Theft) జరిగిన ఘటన కూడా పెద్ద సంచలనంగా మారింది.

ఈ వరుస వివాదాల మధ్య టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో కనిపించకపోవడం మరో చర్చకు దారితీసింది. తిరుమలలో భక్తులకు సౌకర్యాల లోపం, పరిపాలనలో నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు వస్తున్న సమయంలో చైర్మన్ అక్కడ లేకపోవడం సరైనదేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం “నా వ్యాపారాలు నాకు ఉన్నాయి, కొండకు తరచుగా రావాల్సిన అవసరం లేదు” అని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన తిరుమల పరిపాలన కంటే తన వ్యక్తిగత వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం సమంజసమేనా అనే ప్రశ్నలు భక్తులు మరియు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment