---Advertisement---

బాలీవుడ్‌పై కంగనా ఫైర్.. అశ్లీలత హద్దులు దాటిందని సంచలన వ్యాఖ్యలు

March 17, 2026

Summarize with AI

---Advertisement---

బాలీవుడ్‌లో పెరుగుతున్న అశ్లీలతపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రంగా స్పందించారు. నటి నోరా ఫతేహి (Nora Fatehi) నటించిన తాజా పాట సర్కే చునర్ తేరి సర్కే (Sarkey Chunar Teri Sarkey) చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆమె బాలీవుడ్ (Bollywood) తీరును తీవ్రంగా విమర్శించారు.

అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు అవసరం

ఈ పాటలోని సాహిత్యం, చిత్రీకరణపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ చౌకబారు ట్రిక్కులు, అటెన్షన్ కోసం అశ్లీలతను (Obscenity) ఉపయోగించడం హద్దులు దాటిపోయిందని కంగనా రనౌత్ మండిపడ్డారు. దేశం మొత్తం విమర్శిస్తున్నా, ఖండిస్తున్నా కూడా వారికి ఎలాంటి సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.

ఇలాంటి అశ్లీల ప్రదర్శనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కంగనా రనౌత్ డిమాండ్ చేశారు. కఠిన నియంత్రణలు ఉంటేనే ఇలాంటి కంటెంట్‌కు ముగింపు పలకవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

సాంగ్‌పై వివాదం ఎలా మొదలైంది

కన్నడ సినిమా (Kannada film) కోసం రూపొందించిన ఈ హిందీ పాటలో డబుల్ మీనింగ్ డైలాగులు (Double Meaning Dialogues), అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఈ అంశంపై గాయకుడు అర్మాన్ మాలిక్ (Armaan Malik) కూడా స్పందిస్తూ కమర్షియల్ పాటల రచన ఇంత దిగజారిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

తీవ్ర నిరసనల మధ్య ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్(YouTube) నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment