---Advertisement---

బీహార్ రాజకీయాల్లో భారీ మార్పులు.. 2 కీలక రాజీనామాలు, సీఎం పదవిపై సస్పెన్స్

March 30, 2026

Summarize with AI

---Advertisement---

బీహార్ రాజకీయాల్లో (Bihar Politics) అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, మరోవైపు నితిన్ నవీన్ (Nitin Naveen) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఇద్దరూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో నిబంధనల ప్రకారం తమ తమ పదవులకు వీడ్కోలు పలికారు.

రాజ్యసభ ఎంట్రీతో పదవులకు గుడ్‌బై

బీజేపీ నేత నితిన్ నవీన్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ (Prem Kumar) ఆమోదించారు. అలాగే నితీష్ కుమార్ తన రాజీనామాను స్పీకర్‌కు (Speaker) సమర్పించినట్లు జేడీయూ సీనియర్ నేత విజయ్ చౌదరి (Vijay Choudhary) వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. నియమాల ప్రకారం 14 రోజుల గడువు ఉండడంతో ఈరోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక ఏప్రిల్ 10న రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సీఎం మార్పుపై సస్పెన్స్

ఈ రాజీనామాల తర్వాత బీహార్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అధికార కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఈసారి జేడీయూ స్థానంలో బీజేపీ(BJP) నుంచి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆ పదవిని ఎవరు చేపడతారు అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment