తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ఎన్నికల హోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M. K. Stalin) కొలత్తూరు నియోజకవర్గం (Kolathur Constituency) నుంచి నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
రెండు చోట్ల నుంచి బరిలో విజయ్.. ర్యాలీలతో ఆకర్షణ
ఇక తమిళగ వెట్రి కజగం పార్టీ(TVK Party) అధినేత విజయ్ (Vijay) కూడా పెరంబూర్ నుంచి నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి రిటర్నింగ్ కేంద్రానికి చేరుకుని తన నామినేషన్ సమర్పించారు.
విజయ్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. తిరుచారాపల్లి ఈస్ట్ (Tiruchirappalli East), పెరంబూర్ (Perambur) నుంచి ఆయన బరిలో నిలిచారు. నామినేషన్ అనంతరం పెరంబూర్లో విజయ్ భారీ ర్యాలీ నిర్వహించడం విశేషం.
ప్రస్తుతం స్టాలిన్, విజయ్ ఇద్దరూ ర్యాలీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో ఉండటంతో తమిళనాడు ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.






