---Advertisement---

‘ధురంధర్-2’పై కోహ్లీ ఫిదా.. ఇలాంటి అనుభూతి ఎప్పుడూ చూడలేదంటూ ప్రశంసలు

April 7, 2026

---Advertisement---

బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ధురంధర్-2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజునుంచే పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు సాధిస్తోంది.

రణ్‌వీర్ నటనపై కోహ్లీ ప్రశంసల వర్షం

ఈ సినిమాను వీక్షించిన భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన స్పందనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధురంధర్-2 ఒక అద్భుతమైన సినీ అనుభూతిని ఇచ్చిందని, ఇండియన్ సినిమాల్లో ఇలాంటి అనుభవం తాను ముందెన్నడూ చూడలేదని తెలిపారు. సినిమా దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా బోర్ అనిపించలేదని పేర్కొన్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభపై కోహ్లీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆయనను జీనియస్‌గా అభివర్ణించారు. ఇక రణ్‌వీర్ సింగ్ నటన గురించి మాట్లాడుతూ సినిమాలోని అందరూ బాగా నటించినప్పటికీ రణ్‌వీర్ మాత్రం మరో స్థాయిలో నటించాడని కొనియాడారు.

కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలకు దర్శకుడు ఆదిత్య ధర్ ఎమోషనల్‌గా స్పందించారు. ఒక లెజెండ్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం తమకు గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. దేశం కోసం కోహ్లీ ఆడే తీరు తమకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కోహ్లీ కామెంట్స్, దర్శకుడి రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment