తిరుమల (Tirumala) తిరుపతి కొండపైకి వెళ్లే నడక మార్గంలో (Walking Path) పులి (Tiger) సంచరించిందంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రచారంలోకి రావడంతో అలిపిరి(Alipiri), శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గాల గుండా కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నడక మార్గంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతుండగా, వీడియో నిజానిజాలపై చర్చ కూడా కొనసాగుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో పులి ప్రత్యక్షంగా కనిపించకపోయినా, దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు (Devotees) భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు, భక్తులు నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లు (Security Arrangements) మరింత కట్టుదిట్టంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది.
ఈ ఘటన నేపథ్యంలో నిజంగానే పులులు లేదా చిరుతలు వంటి వన్యప్రాణులు నడక మార్గంలోకి వస్తే భక్తుల రక్షణ ఎలా ఉంటుందనే ప్రశ్నలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన వన్యప్రాణుల దాడుల ఘటనలను గుర్తు చేస్తూ, కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
నడక మార్గం మొత్తం ఆధునాతన సీసీ కెమెరాల నిఘాను (CCTV Cameras Surveillance) మరింత పెంచడంతో పాటు అటవీ శాఖ, భద్రతా సిబ్బంది(Security Personnel) 24 గంటలు నిరంతర పెట్రోలింగ్ (Patrolling) నిర్వహించాలని భక్తులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.








