---Advertisement---

‘బరి’ సినిమా షూటింగ్‌లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం..

April 15, 2026

Summarize with AI

---Advertisement---

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న తాజా స్పోర్ట్స్ డ్రామా ‘బరి'(Bari) సినిమా షూటింగ్‌లో (Shooting) అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. వాలీబాల్ ఆటగాడి పాత్ర (Volleyball Player Role) కోసం గత కొన్ని నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్న వరుణ్ తేజ్, ప్రాక్టీస్ సమయంలో ఆడుతుండగా కాలికి(Leg) తీవ్ర గాయం అయ్యింది. గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.

ఈరోజు హైదరాబాద్‌లోని (Hyderabad) ఆసుపత్రిలో వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స జరగనుంది. డాక్టర్ల సూచన మేరకు సర్జరీ (Surgery) అనంతరం ఆయన కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బరి సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

సినిమా కోసం అంతగా కష్టపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment