---Advertisement---

ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. 8 మంది దుర్మరణం

April 17, 2026

---Advertisement---

ఇండోనేషియాలో (Indonesia) విషాదకర హెలికాప్టర్ (Helicopter) ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కలిమంతాన్ ప్రావిన్స్‌ (West Kalimantan Province) లో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హఠాత్తుగా కూలిపోవడంతో అందులో ఉన్న 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఎయిర్‌బస్ హెచ్130 (Airbus H130) హెలికాప్టర్ గురువారం ఉదయం మెలావి ప్రాంతంలోని ఓ తోట నుంచి బయలుదేరింది. అయితే ఎగిరిన కేవలం 5 నిమిషాల్లోనే రాడార్ (Radar) నుంచి అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం సమీప అడవి ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు గుర్తించారు.

ఈ ప్రమాదం ఎత్తైన కొండ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.

హెలికాప్టర్‌లో 6 మంది ప్రయాణికులు, 2 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ఘటనలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

సైన్యం, పోలీసులు, రక్షణ సిబ్బంది భూమార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారా సంస్థకు (Mathieu Air Nusantara) చెందినదిగా గుర్తించారు. పామ్ ఆయిల్ కంపెనీ తోట పనుల కోసం దీనిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment