---Advertisement---

JD Chakravarthy:జేడీ చక్రవర్తి కొత్త అవతారం.. ‘చేతబడి’ టైటిల్‌తో హారర్ మిస్టరీ మూవీ

April 17, 2026

---Advertisement---

జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘చేతబడి’ (Chethabadi) అనే టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను  M3 Media మరియు Maha Movies సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల సమర్పణలో ఈ చిత్రానికి సూర్యాస్ (Suryas) కథ, దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల (Maharshi Koondla) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

హారర్ మిస్టరీగా రానున్న చిత్రం

బాణామతి (Baanamathi) నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా హారర్, మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా ఉండనుందని చిత్ర బృందం చెబుతోంది. సంగీతాన్ని అచ్చు రాజమణి అందిస్తుండగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్ (Mirlan Naseer), ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. జేడీ చక్రవర్తి (JD Chakravarthy) పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను కూడా మేకర్స్ పరిచయం చేశారు. ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే 5 భాషల ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ సరిగమ దక్కించుకుంది. ఒకే పాటను 5 భాషల్లో విడుదల చేయడం సాధారణమే అయినా, ఈ సినిమాలో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో వేర్వేరు పాటలను ఒకే దృశ్యాలతో విడుదల చేయనున్నారు. ఇది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment