---Advertisement---

ఇంటి నుంచి గెంటేస్తే పార్టీ పెడతారా?.. కవితపై మంత్రి పొన్నం ఘాటు సెటైర్లు

April 25, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ రాష్ట్ర సేన (TRS)పేరుతో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రంగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కవిత రాజకీయ నిర్ణయాలను, తాజా వ్యాఖ్యలను తప్పుబట్టారు.

రాజకీయాల్లో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుందని, అయితే పార్టీ ప్రారంభించిన తొలి రోజే విమర్శలకు దిగడం సరైంది కాదని అన్నారు. కొత్త పార్టీ ప్రారంభించినప్పుడు ప్రజలకు ఉపయోగపడే మంచి సూచనలు ఇవ్వాల్సిందిపోయి, కేవలం విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) కవిత(Kavitha) చేసిన కర్కోటకుడు వ్యాఖ్యలపై కూడా పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పార్టీ ప్రారంభ సభలోనే ఇలాంటి పదజాలం ఉపయోగించడం సరైంది కాదన్నారు. ఇది కవితలో ఉన్న అధికార ఆశను బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.

కవిత తన సొంత కుటుంబం, పాత పార్టీలో ఎదుర్కొన్న పరిణామాలపై కూడా మంత్రి సెటైర్లు వేశారు. ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని మంత్రి ఆరోపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment