---Advertisement---

BRS 26th Foundation Day: 25 ఏళ్ల చరిత్ర.. 26వ ఏడాదిలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్

April 27, 2026

---Advertisement---

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (Bharat Rashtra Samithi – BRS) నేడు 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని (26th Foundation Day) ఘనంగా నిర్వహిస్తోంది. 2001 ఏప్రిల్ 27న స్థాపించబడిన ఈ పార్టీ, విజయవంతంగా 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జెండా (Party Flag) ఆవిష్కరించనున్నారు. అలాగే గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనూ జెండా ఎగరవేయాలని నాయకత్వం కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్(KCR) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

సమావేశంలో పార్టీ 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర, 10 ఏళ్ల పాలన అనుభవం, గత 2.5 ఏళ్ల ప్రతిపక్ష పోరాటంపై కేసీఆర్ సమీక్ష చేయనున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో మరింతగా చేరువ కావడం వంటి అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశముంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment