టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ (Nithya Menen) మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం నటనతోనే ప్రేక్షకులను మెప్పించే ఈ టాలెంటెడ్ హీరోయిన్ ప్రస్తుతం మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో సైలెంట్‌గా సక్సెస్ అందుకుంటోంది. అయితే సినిమాలకంటే బయట కూడా తన వ్యక్తిత్వంతో, స్పష్టమైన అభిప్రాయాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది.
ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పెళ్లి(Marriage), తల్లి కావడం (Becoming Mother) వంటి విషయాలపై ఆమె చెప్పిన మాటలు పెద్ద చర్చకు దారితీశాయి. సాధారణంగా హీరోయిన్లు (Heroines) ఇలాంటి వ్యక్తిగత అంశాలపై జాగ్రత్తగా స్పందిస్తుంటారు. కానీ నిత్య మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది.
నిత్యా మాట్లాడుతూ.. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయం అని తెలిపింది. దానికి పెళ్లితో తప్పనిసరి సంబంధం లేదని పేర్కొంది. ఆధునిక కాలంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని, పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. నా శరీరం, నా జీవితం.. నిర్ణయం కూడా నాదే కావాలని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, సింగిల్ లైఫ్‌ను (Single Life) ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు నిత్యా నిజాయితీని ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో నిత్యా వ్యాఖ్యలపై విభిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాలపై ఆమె చెప్పిన మాటలకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం సంప్రదాయ విలువల కోణంలో చర్చిస్తున్నారు.
ఏదేమైనా నిత్యా మీనన్ మరోసారి తన ధైర్యమైన ఆలోచనలతో, స్పష్టమైన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందం మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కలిసిన నటి అని మరోసారి నిరూపించుకుంది.






