---Advertisement---

ఐపీఎల్‌లో ‘బాల కార్మిక’ వివాదం.. వైభవ్ సూర్యవంశీపై కొత్త దుమారం!

May 2, 2026

---Advertisement---

ఐపీఎల్‌లో (IPL) చిన్న వయసులోనే అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు వివాదాల మధ్య నిలిచాడు. 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ 2025లో అడుగుపెట్టిన అతడు, 2026 సీజన్ ప్రారంభం నుంచే తన ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు అతని భాగస్వామ్యమే ఐపీఎల్‌కు ‘బాల కార్మిక’ (Child Labor) ఆరోపణలను తెచ్చిపెట్టింది.

ఒక కన్నడ టీవీ ఛానల్‌లో మాట్లాడిన సామాజిక కార్యకర్త, వైభవ్ ఐపీఎల్‌లో ఆడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం 15 ఏళ్ల వయసున్న బాలుడు ఇంత పెద్ద ప్రొఫెషనల్ లీగ్‌లో పాల్గొనడం చైల్డ్ లేబర్ (Child Labor) కిందకు వస్తుందని, ఇది చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వెంటనే అతడిని టోర్నమెంట్ నుంచి తప్పించి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు.

రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్యం దీనిపై స్పందించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఈ అంశం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సూర్యవంశీ వయసు దృష్ట్యా అతను చదువుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆ కార్యకర్త అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం ఇంత చిన్న వయసులో ఉన్న బాలుడు ప్రొఫెషనల్ స్థాయిలో క్రికెట్ ఆడటం సరైనది కాదని వాదిస్తున్నారు.

అయితే మరోవైపు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇలాంటి వివాదం తలెత్తడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమేనా లేక నిజంగా నిబంధనల ఉల్లంఘనా అన్న దానిపై క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment