---Advertisement---

“నా పెళ్లాం నిప్పురా”.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

May 2, 2026

---Advertisement---

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కుమారుడిగా (Son) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో, తాజాగా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్రీనివాస్, తన ప్రియురాలు కావ్యను (Kavya) వివాహం చేసుకుని ఒక ఇంటివారయ్యారు.

ఏప్రిల్ 29న పవిత్ర క్షేత్రం తిరుపతిలో శ్రీనివాస్-కావ్యల (Sreenivas–Kavya) వివాహం (Wedding) ఎంతో వైభవంగా జరిగింది. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతిలో (Tirupati) జరిగిన కారణంగా టాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగా హాజరు కాలేకపోయారు. దీంతో హైదరాబాద్‌లో (Hyderabad) ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ రిసెప్షన్‌కు (Reception) టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

రిసెప్షన్ ఫోటోలను షేర్ చేస్తూ శ్రీనివాస్ తన భార్యపై ఎంతో ప్రేమను వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు నేను కనుగొన్న వాటన్నింటికంటే గొప్ప నిధిని కనుగొన్నాను. ప్రపంచమా.. నా భార్యను కలుసుకోండి” అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. అయితే ఈ క్యాప్షన్ కంటే, తన పాత సినిమా ‘జయ జానకి నాయక’లోని ఫేమస్ డైలాగ్‌ను మళ్లీ ఉపయోగిస్తూ “నా పెళ్లాం నిప్పురా”(My Wife is Fire) అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీనివాస్ తన భార్యను “నిప్పు”తో పోల్చడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మీమ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తుండగా, మరికొందరు ఫన్నీగా హెచ్చరిస్తున్నారు. “బ్రదర్.. నిప్పుతో ఆటలు వద్దు.. జాగ్రత్త! ఈ మధ్య చాలా మంది భర్తలు అదే నిప్పులో కాలిపోతున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెళ్లి ఫోటోలు, పోస్ట్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment