---Advertisement---

OTT: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’… ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!

May 9, 2026

---Advertisement---

రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2 – ద రివెంజ్’(Dhurandhar 2 – The Revenge)’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2026 మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. థియేటర్లలో రచ్చ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే దీని డిజిటల్ విడుదల విషయంలో ఆసక్తికర ట్విస్ట్ బయటపడింది.

అంతర్జాతీయంగా ప్రముఖ ఓటీటీ(OTT) వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) మే 14, 2026 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కొన్ని దేశాల్లో టైమ్ జోన్ కారణంగా మే 15 నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన వెర్షన్ కంటే అదనపు సన్నివేశాలతో ఈ ఓటీటీ వెర్షన్ విడుదల కానుండటం విశేషం. “రా అండ్ అన్‌దేఖా”(Raw and Andekha) ట్యాగ్‌లైన్‌తో దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా అన్‌సెన్సార్డ్ డైలాగులు కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

భారతదేశ ప్రేక్షకులకు మాత్రం మరో సర్‌ప్రైజ్ ఎదురైంది. ఇండియాలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా జియో హాట్‌స్టార్‌లో (Jio Hotstar) విడుదల కానున్నట్లు సమాచారం. డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో విడుదలై 8 వారాలు పూర్తయిన తర్వాత మే మధ్యలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోర్టు వివాదంతో కూడా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ‘త్రిదేవ్’(Tridev) చిత్రంలోని సూపర్ హిట్ పాట ‘తిర్చి టోపివాలే’ను ఈ సినిమాలో ‘రంగ్ దే లాల్’ పేరుతో రీమిక్స్ చేయడంపై వివాదం చెలరేగింది. అసలు దర్శకుడు రాజీవ్ రాయ్ అనుమతి లేకుండా పాటను ఉపయోగించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలోనే నిర్మాతలు ఓటీటీ విడుదల తేదీపై (OTT Release Date) కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘ధురంధర్ 2’ ఓటీటీలో కూడా అదే స్థాయి హిట్ అవుతుందా అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment