తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ముఖ్యమంత్రిగా(CM) దూసుకెళ్తున్న విజయ్(Vijay) మరో కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, ముఖ్యంగా విద్యార్థులు (Students) మరియు మహిళల భద్రతను (Women Safety) దృష్టిలో పెట్టుకుని పాఠశాలల సమీపంలో ఉన్న 717 వైన్ షాపులను (Wine Shops) మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నిర్ణయంపై నటుడు విశాల్(Vishal) తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. “సీఎం విజయ్ గారికి నా హ్యాట్సాఫ్. స్కూల్స్ దగ్గర ఉన్న 717 వైన్ షాపులను మూసివేయాలనే మీ నిర్ణయం అద్భుతం. దీనివల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపుల (Harassment) నుంచి రక్షణ పొందుతారు. ముఖ్యంగా ఆర్కే నగర్ వంటి ప్రాంతాల్లో స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను స్వయంగా చూశాను. ఈ మార్పు చాలా అవసరం” అంటూ పేర్కొన్నారు.
పాఠశాలలు(Schools), ఆలయాల (Temples) పరిసరాల్లో ఉన్న మద్యం దుకాణాల కారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాలాకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ సమస్యలకు కొంతవరకు చెక్ పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మహిళా సంఘాలు, తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
సినీ హీరోగా ‘జన నాయగన్’(Jana Nayagan) వంటి చిత్రాలతో అభిమానులను ఆకట్టుకున్న విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడం విశేషంగా మారింది. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్న ఆయన, ఇప్పుడు మద్యం దుకాణాల మూసివేత నిర్ణయంతో మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.
విశాల్ వంటి స్టార్ హీరోలు బహిరంగంగా మద్దతు తెలపడంతో ఈ అంశం ఇప్పుడు నేషనల్ లెవల్లో హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక భద్రత, మహిళల రక్షణ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది ‘మాస్ డెసిషన్’(Mass Decision)గా అభివర్ణిస్తున్నారు.
Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB
— Vishal (@VishalKOfficial) May 12, 2026






