---Advertisement---

ఎన్టీఆర్ బర్త్‌డేకు ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్.. మే 20న ‘NTRNeel’ నుంచి మాస్ బ్లాస్ట్!

May 14, 2026

---Advertisement---

యంగ్ టైగర్ N. T. Rama Rao Jr. – స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ నాడిని పట్టుకున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది.

తాజాగా #NTRNeel నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సముద్ర తీరంలో నిలబడి ఉన్న ఇంటెన్స్ లుక్‌ను మేకర్స్ షేర్ చేశారు. అయితే ఈ పోస్టర్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కొత్త ట్యాగ్‌లైన్. గతంలో ఉన్న “You know the business and I know the chemistry” అనే లైన్‌ను మార్చి, ఇప్పుడు “You know the vision.. and I know the storm” అనే పవర్‌ఫుల్ ఫ్రేజ్‌ను జోడించారు. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలోని యాక్షన్ రేంజ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చినట్టైంది.

ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న, అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి భారీ సర్‌ప్రైజ్ రానున్నట్లు సమాచారం. అదే రోజున మూవీ టైటిల్‌తో (Movie Title) పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను (First Glimpse) కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే భారీ హంగామా మొదలుపెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) – ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్(Ravi Basrur) అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment