తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన హనుమాన్ (HanuMan) చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ కలెక్షన్లు సాధించింది.
ఇప్పుడు ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా 3D ఫార్మాట్లో (3D Format) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. హనుమాన్ 3D వర్షన్‌ను 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే సాధారణ వర్షన్‌తో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమా, 3D టెక్నాలజీతో ప్రేక్షకులకు మరింత విజువల్ అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ 3Dలో మరో స్థాయిలో కనిపించనున్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi Sarathkumar), సముద్రఖని, వెన్నెల కిషోర్, గెటప్ శీను, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.






