---Advertisement---

నేడు చెన్నైతో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్.. ఇకనైనా ధోనీని ఆడిస్తారా?

May 18, 2026

Summarize with AI

---Advertisement---

ఐపీఎల్ (IPL) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం (Chepauk Stadium) వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా, సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిమానుల దృష్టంతా మహేంద్రసింగ్ ధోనీపై (Mahendra Singh Dhoni) నిలిచింది. ఈసారి అయినా ధోనీ మైదానంలోకి దిగుతాడా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చెన్నై తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో ధోనీ తప్పకుండా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

గతంలో తన చివరి టీ20 మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడాలని ధోనీ చెప్పిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చెపాక్ ప్రేక్షకుల ముందే ధోనీని మరోసారి బ్యాట్ పట్టుకుని చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్లే ఆఫ్స్ (Playoffs) సమీకరణాలు కూడా ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే గుజరాత్ టైటాన్స్‌తో(GT) పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కూడా ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment