---Advertisement---

ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి

May 19, 2026

---Advertisement---

ఉత్తరాఖండ్ (Uttarakhand) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), రిటైర్డ్ మేజర్ జనరల్ (Major General) భువన్ చంద్ర ఖండూరి (Bhuvan Chandra Khanduri)((91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు(Passed Away). గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్‌లోని (Dehradun) మ్యాక్స్ ఆస్పత్రిలో (Max Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఉత్తరాఖండ్ రాజకీయ వర్గాలు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

భువన్ చంద్ర ఖండూరి భారత ఆర్మీలో(Indian Army) విశిష్ట సేవలు అందించి మేజర్ జనరల్ హోదా వరకు ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి భారతీయ జనతా పార్టీ (BJP)తరఫున కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమని పలువురు నేతలు కొనియాడుతున్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand Chief Minister) పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) భువన్ చంద్ర ఖండూరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లోనే కాకుండా భారత సైన్యంలో కూడా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఖండూరి లేని లోటు ఎప్పటికీ భర్తీ చేయలేనిదని ధామి అన్నారు.

భువన్ చంద్ర ఖండూరి స్మారకార్థం ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment