కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన జననాయగన్ (Jananayagan) సినిమాకు ఎట్టకేలకు రిలీజ్ అడ్డంకులు తొలగిపోయాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెన్సార్ అభ్యంతరాల కారణంగా సినిమా విడుదల అనిశ్చితిలో పడింది. షూటింగ్ పూర్తయినా సెన్సార్ సర్టిఫికెట్ (Censor Certificate) ఆలస్యం కావడంతో మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టినా కూడా జననాయగన్ రిలీజ్ డేట్‌పై (Release Date) ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో కూడా మూవీ రిలీజ్‌పై అనేక చర్చలు నడిచాయి.
అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చే అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ “కష్టాలు, సవాళ్లను అధిగమించి చివరకు వచ్చేశాం.. జననాయగన్ 2026 జూన్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు (Grand Theatrical Release) సిద్ధమైంది.. నాయకుడు వచ్చేశాడు” అంటూ ప్రకటించారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకుడిగా విజయ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం కావడంతో జననాయగన్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రానికి హెచ్ వినోద్ (H. Vinoth) దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.






