---Advertisement---

రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై శివరాజ్‌కుమార్ (శివన్న) సంచలన వ్యాఖ్యలు!

May 25, 2026

---Advertisement---

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై (Peddi) అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) (Shiva Rajkumar) కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ.. రామ్‌చరణ్ మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు చూపిస్తున్న కష్టపాటు, సిన్సియారిటీనే ఆయనను గ్లోబల్ స్టార్ స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు. చరణ్ కెరీర్‌లో వచ్చిన ప్రతి మెట్టు వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రేమ కూడా ఎంతో ఉందని అన్నారు. ఒక ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.

తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar)ను తాను ఎలా చూసుకునేవాడినో.. అదే ప్రేమతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా రామ్‌చరణ్‌ను చూసుకుంటారని శివన్న చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో తాను స్వయంగా రక్తదానం చేశానని గుర్తుచేసుకున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా ‘పెద్ది’ కథను చాలా ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని శివన్న ప్రశంసించారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ నటనకు కచ్చితంగా నేషనల్ అవార్డ్ (National Award) రావాలని కోరుకుంటున్నానని, ఆయన పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉంటుందని అన్నారు. ముఖ్యంగా సినిమాలో తమ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమా మాత్రమే కాదని.. ఒక మనిషి జీవితానికి ఆటకు ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించే చిత్రం అని శివన్న వెల్లడించారు. ఎందుకు ఆడాలి? ఎవరి కోసం పోరాడాలి? అనే బలమైన భావోద్వేగాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment