మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభం నమోదు చేసింది. గత కొన్ని వారాలుగా భారీ సినిమాల సందడి లేక డల్‌గా కనిపించిన థియేటర్లకు ‘పెద్ది’ కొత్త జోష్ తీసుకొచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. మొదటి రోజే అంచనాలను మించి కలెక్షన్స్(Collections) సాధించి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.
చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘పెద్ది’ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది. రామ్ చరణ్ మాస్ క్రేజ్, బుచ్చిబాబు పవర్ఫుల్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) అందించిన మ్యూజిక్ కలిసి ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. దీంతో ఓపెనింగ్ డే నుంచే భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ.. “బాక్సాఫీస్ ఛాంపియన్ (Box Office Champion) – పెద్ది.. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్” అంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కలెక్షన్స్‌తో రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’ నిలిచింది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’తో రూ.100 కోట్ల క్లబ్లో సెన్సేషన్ సృష్టించిన చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ నిరాశ తర్వాత ఇప్పుడు ‘పెద్ది’తో మళ్లీ భారీ కమ్‌బ్యాక్ ఇచ్చినట్టైంది.
మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ (Range Collections) రావడంతో.. లాంగ్ రన్లో ‘పెద్ది’ మరిన్ని ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఇప్పుడు నిజంగానే బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా దూసుకెళ్తోంది.






