---Advertisement---

Prakash Raj: “మేము గొర్రెలం కాదు.. ప్రశ్నిస్తాం” నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..!

June 6, 2026

Summarize with AI

---Advertisement---

సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ నాగబాబు(Nagababu), సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) మధ్య మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. నాయకత్వం, ప్రశ్నించే హక్కు, బ్లైండ్ ఫాలోయింగ్ (Blind Following) అంశాలపై ఇద్దరి మధ్య జరిగిన ఈ ట్వీట్ వార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఇటీవల నాగబాబు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నాయకుడి పాత్ర గురించి ప్రస్తావిస్తూ “నాయకుడి (Leader) మాటే శాసనం. నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దెయ్యాలు, రాక్షసులు సామాన్యులకు కనిపించవు. ఏది తప్పు, ఏది సరి అనేది నాయకుడికే తెలుస్తుంది. కాబట్టి మీ అనుమానాలను పక్కన పెట్టండి. నోళ్లు మూసుకోండి. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా మీ నాయకుడిని మాత్రమే అనుసరించండి” అంటూ పవన్ కళ్యాణ్ ఫొటోను షేర్ చేశారు.

ఈ పోస్టు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ మొదలైంది. కొందరు నాగబాబు వ్యాఖ్యలకు మద్దతు తెలపగా, మరికొందరు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా “ప్రశ్నలు అడగొద్దు” (Don’t Ask Questions) అన్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున డిబేట్ నడిచింది.

ఈ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఘాటుగా స్పందించారు. నాగబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి, ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు?” అంటూ ప్రశ్నించారు.

అక్కడితో ఆగకుండా “మేము గొర్రెలం (Sheep) కాదు. బానిసల (Slaves) మాదిరిగా బ్రతకడానికి సిద్ధంగా లేం. ఇలాంటి బెదిరింపులు మా దగ్గర పని చేయవు. ప్రశ్నించడం మా ప్రాథమిక హక్కు. ఏ నాయకుడైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. తానే లీడర్‌ని అని అహంకారంతో వ్యవహరించినా ప్రజలు ప్రశ్నిస్తారు” అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వార్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరి అభిమానులు కూడా కామెంట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. ఒకవైపు నాగబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థించే వారు ఉంటే, మరోవైపు ప్రకాష్ రాజ్ స్పందనను అభినందించే వారు కూడా కనిపిస్తున్నారు.

ఇక గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్‌కు నాగబాబు, మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్ తరచూ పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) పాటు మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తుండటం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment