---Advertisement---

Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ సంచలమైన ట్వీట్

June 8, 2026

---Advertisement---

టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా స్పందించే రాహుల్ రామకృష్ణ.. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) నేరుగా ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో పారదర్శకత, సమాచార హక్కు చట్టం అమలుపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తన ట్వీట్‌లో రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారు.. మీ గొప్పలు, ఆర్భాటాలు(Publicity) పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI Act) కింద మీరు నిర్వహించే శాఖల్లో ప్రతి విభాగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారా? సెక్షన్ 4.1(బి) ప్రకారం ముందస్తు సమాచార బహిర్గతాన్ని అమలు చేశారా? నేను అభిమానిగా అడుగుతున్నా.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అంటూ ప్రశ్నించారు.

అక్కడితో ఆగని రాహుల్ రామకృష్ణ.. గిరిజన ప్రాంతాల్లో (Tribal Areas) అమలు కావాల్సిన చట్టాలపై కూడా స్పందించారు. “పెసా చట్టం(PESA Act), 1/70 చట్టం, గ్రామసభ చట్టం (Gram Sabha Act) అమలుకు సంబంధించిన ఫలితాలను బయటపెట్టండి. మీరు చేపట్టిన అటవీకరణ కార్యక్రమాల అసలు లెక్కలు చెప్పండి. స్వతంత్ర సంస్థలు పరిశీలించిన గణాంకాలు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. నేను స్వయంగా సేకరించిన వివరాల ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

అయితే ట్వీట్ చివర్లో రాహుల్ రామకృష్ణ “జై తెలంగాణ”(Jai Telangana) అని పేర్కొనడం మరింత చర్చకు దారితీసింది. ఇటీవల హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం కొనసాగుతున్న సమయంలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి వచ్చే ట్రోలింగ్‌ను ముందుగానే ఊహించిన రాహుల్ రామకృష్ణ.. “ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను” అంటూ మరో ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment