టాలీవుడ్‌లో హీరోలకు మాస్ ఇమేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మరోసారి తన మార్క్ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరీ, ఇప్పుడు ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’(SlumDog – 33 Temple Road) సినిమాతో గట్టిగా కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ (Teaser) సోషల్ మీడియాలో గూస్‌బంప్స్ (Goosebumps) తెప్పిస్తూ వైరల్ అవుతోంది.
పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, జె.బి మోషన్ పిక్చర్స్(JB Motion Pictures)బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్(Charmy Kaur), జె.బి నారాయణరావు కొండ్రొల్ల (JB Narayan Rao Kondrolla) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసిన టీజర్‌లో పూరీ స్టైల్ మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
“ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నిన్ను ఎందుకు వదులుతాం” అనే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవడం హైలైట్‌గా నిలిచింది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలోని ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉంటుందో మేకర్స్ చూపించారు. టీజర్ మొత్తం రఫ్ అండ్ రియలిస్టిక్ టోన్‌లో సాగుతూ ప్రతి ఫ్రేమ్‌లో మాస్ ఫీల్‌ను తీసుకొచ్చింది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), టబు(Tabu), సంయుక్త, దునియా విజయ్ కుమార్, జరీనా వహాబ్, వి.టి.వి గణేష్, బ్రహ్మాజీ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతి పాత్రను చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి లుక్, యాక్షన్ సీన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) సంగీతం అందిస్తుండగా, శామ్ కె.నాయుడు (Shyam K Naidu) సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంతోష్ నూజిళ్ల ఎడిటింగ్ చేస్తున్నారు. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పూరీ జగన్నాథ్ కెరీర్‌లో కీలక చిత్రంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుండగా, ఈసారి పూరీ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.






