---Advertisement---

‘పెద్ది’ పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ..రామ్ చరణ్ నటనపై ప్రశంసల జల్లు

June 9, 2026

Summarize with AI

---Advertisement---

బాక్సాఫీస్ దగ్గర వివాదాల నడుమ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘పెద్ది’(Peddi) సినిమాపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుండగా, స్వయంగా మూవీ చూసిన బన్నీ తన అభిప్రాయాన్ని బయటపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

‘పెద్ది’ చూసిన తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటనపై (Performance) అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ పర్ఫార్మెన్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ గా (Mind Blowing) ఉందని పేర్కొన్నారు. పెద్ది పాత్రలో చరణ్ చూపించిన ఇంటెన్సిటీ(Intensity), సహజమైన నటన(Natural Acting), ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ (Physical Transformation) అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా డ్యాన్స్ లో కనిపించిన గ్రేస్ మరో స్థాయిలో ఉందని కొనియాడారు.

ప్రతి సీన్ లోనూ చరణ్ తన పాత్రను జీవించాడని, ఒక పూర్తి స్థాయి నటుడిగా మరోసారి నిరూపించుకున్నాడని బన్నీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చరణ్ అందుకుంటున్న ప్రశంసలన్నీ అతడు తన కష్టంతో సంపాదించుకున్నవేనని చెప్పారు. తన సోదరుడి విజయాన్ని చూసి ఎంతో గర్వంగా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

ఇక బన్నీ చేసిన ఈ పోస్ట్ తో మెగా అభిమానుల్లో మరింత జోష్ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ మూవీకి వస్తున్న స్పందనతో పాటు బన్నీ రివ్యూ (Bunny Review) కూడా సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment