---Advertisement---

అవమానకర వ్యాఖ్యల ఎఫెక్ట్ – ఏబీఎన్‌ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్న

April 7, 2026

---Advertisement---

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నిరసనలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, లక్ష్మీపార్వతి, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, తోపుదుర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాఖ్యలు జర్నలిజం విలువలను దిగజార్చేలా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా మహిళలను అవమానించేలా ఉన్న రాతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర బాధ్యతాయుతంగా ఉండాలని, కానీ ఈ తరహా వ్యాఖ్యలు సమాజంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలు, రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు కేవలం జర్నలిజం కాదని, అవి రాజకీయ ప్రేరణతో కూడుకున్నవని ఆరోపించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అనాగరికమని, దీనిపై తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment