---Advertisement---

మళ్లీ జైలుకే అంబటి రాంబాబు.. సంక్రాంతి సంబరాల కేసులో 14 రోజుల రిమాండ్

February 12, 2026

Summarize with AI

---Advertisement---

మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu)కు మరోసారి జైలు శిక్ష విధించబడింది. సంక్రాంతి సంబరాల కేసు (Sankranthi Celebrations Case)లో గుంటూరు సివిల్ జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.

సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా వివాదం

2023లో సంక్రాంతి సందర్భంగా గుంటూరు జిల్లా (Guntur District) సత్తెనపల్లి నియోజకవర్గం (Sattenapalli Constituency)లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం వివాదానికి దారి తీసింది. సంబరాల పేరుతో అక్రమాలు జరిగాయని, భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో జనసేన పార్టీ జిల్లా ఇంచార్జి గాదె వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని అప్పటికే జైలులో ఉన్న అంబటిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇక అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదైనట్లు సమాచారం. సీఎం చంద్రబాబును దూషించిన కేసు, గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో కూడా ఆయనకు రిమాండ్ విధించబడింది. అయితే ఆ రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఇదే సమయంలో సంక్రాంతి సంబరాల కేసులో రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment