---Advertisement---

ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ.. ఆరోగ్యంపై స్వయంగా కీలక ప్రకటన

April 24, 2026

---Advertisement---

ఇజ్రాయిల్ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) తన ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. తనకు ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని వెల్లడించారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆరోగ్యం బాగుందని, శారీరకంగా దృఢంగా ఉన్నానని తెలిపారు.

యుద్ధ పరిస్థితులు తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో వార్షిక ఆరోగ్య నివేదిక బయటకు రాకుండా ఉండేందుకు, శత్రు దేశాలు తప్పుడు ప్రచారం చేయకుండా ఉండేందుకు ఈ నివేదికను 2 నెలలు వాయిదా వేయాలని తానే కోరినట్లు నెతన్యాహూ తెలిపారు.

దాదాపు 1½ సంవత్సరాల క్రితం ప్రొస్టేట్ విస్తరణ సమస్యకు (Prostate Enlargement Problem) శస్త్రచికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని వెల్లడించారు.

ఇటీవల ప్రొస్టేట్‌లో 1 సెంటీమీటర్ కన్నా చిన్న మచ్చ గుర్తించినట్లు తెలిపారు. దానిపై పరీక్షలు చేయగా అది మొదటి దశ క్యాన్సర్ ట్యూమర్‌గా తేలిందని చెప్పారు. అయితే అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించలేదని స్పష్టం చేశారు.

ఈ సమస్యకు 2 మార్గాలు ఉన్నాయని నెతన్యాహూ చెప్పారు. ఒకటి కేవలం పర్యవేక్షణలో ఉండటం, రెండోది చికిత్స ద్వారా పూర్తిగా తొలగించుకోవడం అని వివరించారు. తాను రెండో మార్గాన్ని ఎంచుకుని లక్ష్యిత చికిత్స తీసుకున్నానని తెలిపారు.

ఇప్పుడు పూర్తిగా క్యాన్సర్ నుంచి బయటపడ్డానని, సమస్య పూర్తిగా తొలగిపోయిందని వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, సమయానికి పరీక్షలు చేయించుకోవాలని నెతన్యాహూ సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment