---Advertisement---

బిట్రగుంట బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

March 5, 2026

---Advertisement---

నెల్లూరు జిల్లా (Nellore District) కొండ బిట్రగుంటలోని (Konda Bitragunta) శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో (Sri Prasanna Venkateswara Swamy Temple) జరిగిన బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తెప్పోత్సవం సందర్భంగా ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు తెప్పపైకి ఎక్కడంతో అది ఒక వైపుకు ఒరిగి పుష్కరిణిలో (Pushkarini) మునిగిపోయింది. అయితే అప్రమత్తమైన భక్తులు స్వామివారి విగ్రహాన్ని సురక్షితంగా కిందకు దించి ప్రమాదాన్ని తప్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని చేతులతో మోస్తూ ఊరేగించారు. ఈ ఘటన ఆలయ ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహానికి దారితీసింది.

ఇదిలా ఉండగా, మార్చి 1న కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ₹2.50 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ఈ పుష్కరిణి ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy), కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prasanthi Reddy) హాజరయ్యారు. గత ఏడాది ఆగస్టు 10న శంకుస్థాపన చేసిన ఈ కోనేరు బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేశాం అని విశేషంగా చెప్పుకున్నారు. అయితే ఈ మోదటి సారే ఇలా అపశ్రుతి చోటు చేసుకోవడంతో సామాన్య భక్తులు కలవరపాటుకు గురయ్యారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment