---Advertisement---

బైకర్ మూవీపై పీ వి సింధు ప్రశంసలు.. శర్వానంద్ నటనకు క్రీడాకారిణి ఫిదా

April 10, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన బైకర్ (Biker) సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మంచి స్పందనతో దూసుకుపోతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించగా తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ వి సింధు (P. V. Sindhu) కూడా తన స్పందనను తెలియజేశారు.

క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించిన సినిమా

సోషల్ మీడియా వేదికగా స్పందించిన పీ వి సింధు ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. కఠిన పరిస్థితుల్లో లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల వేగం ఏకాగ్రత వంటి అంశాలను సినిమాలో బలంగా చూపించారని తెలిపారు. ఒక క్రీడాకారిణిగా ఈ కథ తనకు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పారు.

అలాగే ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హీరో శర్వానంద్ దర్శకుడు అభిలాష్ రెడ్డి (Abhilash Reddy Kankara), కంకర హీరోయిన్ మాళవిక నాయర్ (Malavika Nair) సహా మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment