---Advertisement---

టీటీడీ చరిత్రలో చెరిగిపోని మచ్చగా బీఆర్ నాయుడు నిలిచిపోతారా?

March 3, 2026

---Advertisement---

కొట్లాది హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్ర అనేక దశాబ్దాల పరిపాలనా మార్పులను చూసింది. హిందూ రాజులు, మహమదీయ పాలకులు, బ్రిటీష్ ప్రభుత్వం, మహంతుల ఆధీన పాలన అనంతరం 1933లో ప్రత్యేక చట్టంతో రూపుదిద్దుకున్న ఈ సంస్థ, స్వాతంత్ర్యానంతరం కూడా సాధారణంగా వివాదాలకు దూరంగానే కొనసాగిందనే అభిప్రాయం ఉంది. స్వామివారి సేవలో నిమగ్నమై, రాజకీయాల నుండి దూరంగా వ్యవహరించిన చైర్మన్లు టీటీడీ గౌరవాన్ని కాపాడారనే భావన భక్తుల్లో నెలకొంది.

అయితే ప్రస్తుత పరిణామాలు ఈ సంప్రదాయాన్ని ప్రశ్నించేలా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఆర్ నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ తరచూ వివాదాల కేంద్రబిందువుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తి, అంకితభావం కన్నా రాజకీయ ప్రయోజనాలు ప్రాధాన్యం పొందుతున్నాయనే ఆందోళన భక్త వర్గాల్లో వ్యక్తమవుతోంది.

లడ్డూ ప్రసాదంపై సరైన ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి స్థాయిలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు చేయడం కోట్లాది భక్తులను కలవరపరిచిన అంశంగా మారింది. అదే సమయంలో తిరుమలలో తోక్కిసలాట ఘటనలు చోటుచేసుకుని భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవిత్ర కొండపై నిఘా లోపాలు, మద్యం–మాంసం చేరినట్టు ఆరోపణలు, క్యూ లైన్లలో అవ్యవస్థ, పార్కింగ్ వివాదాలు హింసాత్మక ఘటనలకు దారి తీయడం వంటి పరిణామాలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీశాయని విమర్శకులు పేర్కొంటున్నారు.

అన్నప్రసాదం నాణ్యతపై సందేహాలు, ఆకతాయిల రీల్స్ వీడియోలు, ఆలయ ప్రాంగణంలో నిబంధనల ఉల్లంఘనలు వంటి అంశాలు కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు చైర్మన్‌పై వ్యక్తిగత ఆరోపణలు వెల్లువెత్తడం, వాటిపై స్పష్టత రాకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.

ఈ సమస్త పరిణామాల నేపథ్యంలో, టీటీడీ చరిత్రలో ఇంతటి వివాదాలు ఎప్పుడైనా చోటుచేసుకున్నాయా? గత చైర్మన్లు ఎదుర్కోని అపవాదులు ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తున్నాయి? బీఆర్ నాయుడు పేరు టీటీడీ చరిత్రలో చెరిగిపోని మచ్చగా నిలిచిపోతుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం భక్త వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పవిత్రక్షేత్ర పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, భక్తుల విశ్వాస పరిరక్షణ అత్యంత ముఖ్యమైనవిగా భావించబడుతున్న ఈ సమయంలో, జరుగుతున్న పరిణామాలు భక్తులని మనోవేదనకు గురిచేస్తున్నాయనేది కాదనలేని సత్యం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment