---Advertisement---

బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి.. భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్.

April 3, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధ్యక్షుడు బీఆర్ నాయుడు(B. R. Naidu) తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakaran Reddy) డిమాండ్ చేశారు. మహిళలపై (Women) లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆరోపణల నేపథ్యంలో ఈ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

శనివారం ప్రత్యేక పూజలు.. పోలీసుల చర్యలపై అభ్యంతరం

ఈ అంశంపై నిరసనగా శనివారం తిరుపతిలో (Tirupati) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఇది ర్యాలీలు లేదా ఆందోళనలు కాకుండా కేవలం దేవాలయాల్లో (Temples) ప్రత్యేక పూజలు (Special Prayers, ప్రార్థనలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని పూర్తిగా శాంతియుతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇలాంటి కార్యక్రమానికి కూడా పోలీసులు (Police) సెక్షన్ 30 అమలు చేయడం సరైంది కాదని భూమన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో భక్తి భావంతో పూజలు నిర్వహించడం తమ ఉద్దేశమని తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ముందుగా నిర్ణయించిన విధంగా శనివారం కార్యక్రమం కొనసాగుతుందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment