భారతీయ సినిమాను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకెళ్తోంది ‘ధురంధర్ 2’(Dhurandhar 2). మార్చి 7న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ (Trailer) ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన పొందుతోంది. విడుదలైన 48 గంటల్లోనే అన్ని డిజిటల్ వేదికల్లో కలిపి సుమారు 312 మిలియన్ వ్యూస్ (312 Million Views) సాధించి రికార్డు సృష్టించింది.
ఇక యూట్యూబ్‌లో కూడా ఈ ట్రైలర్ దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో (YouTube Trending) మొదటి స్థానాన్ని (First Position) దక్కించుకుని గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ఈ సినిమాలో రణవీర్ సింగ్ (Ranveer Singh) జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
మరోవైపు ఆర్. మాధవన్ (R. Madhavan) అజయ్ సన్యాల్‌గా కీలక పాత్రలో కనిపించనుండగా, సంజయ్ దత్ (Sanjay Dutt) ఎస్‌పీ చౌధరి అస్లాంగా పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నారు. అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’తో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మిస్తున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.






