---Advertisement---

యర్రావారిపాళెంలో అటవీ ఏనుగుల మృతి… కుంకీ ఏనుగులు ఏమైనట్లు?

March 9, 2026

---Advertisement---

తిరుపతి జిల్లాలోని (Tirupati District) యర్రావారిపాళెం మండలంలో (Yerravaripalem Mandal) జరిగిన విషాదకర ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నైరబైలు ఫారెస్ట్‌ బంగ్లా (Nerabailu Forest Bungalow) సమీపంలో విద్యుదాఘాతంతో రెండు అడవి ఏనుగులు (Wild Elephants) మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అడవి పందుల నుంచి పంటలను రక్షించేందుకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచెకు తగిలి ఈ ఏనుగులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చి భారీగా ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఏనుగులను పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్‌లో ఉంచి శిక్షణ ఇస్తున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు.

అయితే, కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఆ నాలుగు కుంకీ ఏనుగుల్లో కొన్ని లోపాలు ఉన్నాయనే ప్రచారం ఇటీవల వినిపిస్తోంది. ప్రస్తుతం గతంలో నుంచే ఉన్న జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులే అటవీ ఆపరేషన్లకు ఉపయోగపడుతున్నాయని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం వల్లనే ఈ ఘటన వంటి దుర్ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం కుంకీ ఏనుగుల విషయాన్ని ప్రచార పరంగా ప్రాధాన్యం ఇచ్చినా, ఆచరణలో మాత్రం ఫలితాలు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలిఫెంట్ క్యాంప్‌కు కేవలం రెండు గంటల దూరంలోనే ఈ ఘటన జరగడం దీనికి ఉదాహరణగా స్థానికులు చెబుతున్నారు. గతంలో ఒక చిరుత కూడా ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన పెద్ద దుమారానికి కారణమైంది. అయినప్పటికీ అటవీ శాఖ అధికారుల్లో ఇప్పటికీ తగిన చర్యలు కనిపించడం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment